25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలి

Must read

📰 Generate e-Paper Clip

.. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ వినతి

డిచ్ పల్లి, బతుకమ్మ : 

 

ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిల విడుదలకై డిగ్రీ కళాశాలల బంద్ ఉన్నందున పరీక్షలను వాయిదా వేయాలని ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరికి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు రాకపోవడంతో తాము చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, తమకు ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు వస్తేనే కళాశాల నడిపే పరిస్థితి ఉన్నందున గత నాలుగు రోజుల నుండి కళాశాలలను బంద్ చేసి నిరవధికంగా బంద్ చేసి నిరసన తెలుపుతున్నా మన్నారు. ఒకవైపు కళాశాలలు బంద్ ఉండడంతో విద్యార్థులు పరీక్షా ఫీజులు కూడా కట్టడానికి రాలేకపోయారని,ఇంకా దాదాపు 40 శాతం మంది విద్యార్థులు పరీక్షా ఫీజు చెల్లించాల్సి ఉందని వాపోయారు. ఈ కళాశాలల బంద్ పూర్తయ్యే వరకు పరీక్షల సమయ సారిణిని విడుదల చేయొద్దని కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో తమ కళాశాలలు కోలుకోలేని విధంగా మారిపోయాయని, ఇప్పుడు కళాశాలలు తెరిచినా గాని సిబ్బంది పనిచేయడానికి రావడానికి సుముఖంగా లేరని జిల్లా ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి తమను ఆదుకోవాలని అన్నారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద కళాశాల యాజమాన్యాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కళాశాలల యాజమాన్యాలు మారయ్య గౌడ్, శంకర్, శ్రీనివాసరాజు, గురువేందర్ రెడ్డి, అరుణ్,గిరి,రమణ, సత్యం,దత్తు, విజయ్, గంగాధర్,చందన్, గంగారెడ్డి, రషీద్,షకీల్, వెంకట కిషన్ తదితరులున్నారు.

Degree exams should be postponed

More articles

Latest article