26.2 C
Hyderabad
Monday, August 3, 2026

దీన్ దయాల్ జీవితం జన్ సంఘ్ తో ముడిపడిఉన్నది

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సీటి, బతుకమ్మ:         

పండీత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సంధర్బంగా బిజెపి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి పార్టీ నాయకులు, కార్యకర్తలు, దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు  అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ మాట్లాడుతూ .. దీన్ దయాల్ జీవితం సంఘ్ తో పాటు జన్ సంఘ్ తో ముడిపడిఉన్న జివితం వారిది… ఒక సాధారణమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని కుటుంబంతో కూడా అనేక విధాలుగా కష్టాలు ఉన్నప్పటికీకూడా వాటిని అధిగమిస్తూ కోసం సమాజం కోసం పూర్తిగా జీవితాన్ని అర్పించిన గోప్ప వ్యక్తి  పండీత్ దీన్ దయాల్  అన్నారు.  దేశం కోసం పరితపించిన జాతీయవాది పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ. భారతీయ సంస్కృతిని గౌరవించి,దేశం కోసం త్యాగంచేసే దిశగా యువతను ప్రోత్సహించిన మహోన్నత శక్తి  అని గుర్తి చేశారు. డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ మరణం తర్వాత జనసంఘ్‌ నామరూపాలు లేకుండా పోతుందని ఆశించిన వారి ఆలోచనలను తలకిందులు చేస్తూ పార్టీని దేశవ్యాప్తంగా పటిష్ఠపరచిన ఘనత దీనదయాళ్‌జీకి దక్కిందన్నారు •      డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ మరణానంతరం జన సంఘ్ అధ్యక్షులగా కూడా పనిచేయడం జరిగింది. భారతదేశంలోని చిట్టచివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలనే ఉన్నతమైన ఉద్దేశంతో ” అంత్యోదయ పధకం ” రూపకల్పన చేసిన ” ఏకాత్మ మానవతావాదం ” సిద్ధాంతాన్ని ప్రతిపాదించి విశ్వమానవాళికి బహుమతిగా ఇచ్చిన భారతజాతి నిజమైన వారసులలో పండీత్ దీన్ దయాల్  ఉన్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో పొతన్ కార్ లక్ష్మీనారాయణ, బద్దం కిషన్, నారాయణ యాదవ్, ఇప్పాకాయల కిషోర్, స్వామి యాదవ్, మల్లేష్ యాదవ్, జశ్వంత్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article