అంబేద్కర్ జయంతిని రాజ్యాంగ దినం గా ప్రకటించడం గొప్ప విషయం

0 7,508

— అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించిన బిజేపి నాయకులు

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టిన రోజు ను భారత రాజ్యాంగ దినం గా ప్రధాని మోదీ ప్రకటించడం గొప్ప విషయం అని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షుడు కులాచారీ దినేష్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ— ఆ కాలంలో అణగారిన వర్గాల కోసం అదేవిదంగా సమాన న్యాయం, సమానమైన హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. ఈ రోజు ఆయన స్ఫూర్తితో నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగుతోందని అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా నరేంద్ర మోదీ ఆయన జయంతి రోజున రాజ్యాంగ దినం గా ప్రకటించడం జరిగిందన్నారు. ఆయన జ్ఞాపకార్ధం ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన చివరి రోజుల వరకు పంచ తీర్థాలు నిర్మించి ఆయన నివసించిన ప్రదేశం ఆయన చదువుకున్న ప్రదేశం మొట్టమొదటిసారి ఆయన అడుగుజాడల్లో  ఆయన స్ఫూర్తిగా ఈ రోజు నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగుతోంది అని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా  భవిష్యత్తు తరాల యువత ఆయన ఆశయ సాధన కోసం ముందుకు కదలాలి అని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ జిల్లా కార్యదర్శి నాగొల్ల లక్ష్మీనారాయణ గారు, బిజెపి జిల్లా కార్యదర్శి పొతంకర్ లక్ష్మీనారాయణ గారు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు  శివ గారు, బిజెపి మాజీ కార్పొరేటర్ బట్టు రాఘవేంధర్,ఎస్సీ మోర్చా నాయకులు గణపతి, రాజు, సీనియర్ నాయకులు  కార్యకర్తలు పాల్గోన్నారు.

Declaring Ambedkar Jayanti as Constitution Day is a great thing

Leave A Reply

Your email address will not be published.