29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

గుర్తుతెలియని వ్యక్తి మృతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గత నెల 10న నగరంలోని తిలక్ గార్డెన్ వద్దగల ఛాయా ఫొటో స్టూడియో వద్ద గాయపడిన గుర్తు తెలియని వ్యక్తి బుధవారం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్ఎచ్ఓ బి.రఘుపతి తెలిపారు. అతని వయసు సుమారు 50 నుండి 55 వరకు ఉంటుందన్నారు. అతను పెసరి కలర్ రంగు ఫుల్ షర్ట్, తెలుపు రంగు లుంగీ దుస్తులు ధరించి ఉన్నాడని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి గురించి ఏమైనా సమాచారం ఎవరికైనా తెలిసిస్తే నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లేదా 8712659714 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.

More articles

Latest article