వెబ్ న్యూస్, బతుకమ్మ : మార్నింగ్ వాకింగ్ కు వెళ్లి రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డీసీపీ టీఎం నందీశ్వర బాబ్జీ మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. హయత్ నగర్ లోని లక్ష్మారెడ్డిపాలెం మైత్రి కుటీర్ లో బాబ్జీ నివాసముంటున్నారు. శనివారం ఉదయం వాకింగ్ కు వెళ్లారు. ఈక్రమంలో విజయవాడ జాతీయ రహదారి దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఆయనను ఢీకొట్టింది. ఈప్రమాదంలో డీసీపీ మృతి చెందాడు. పోలీసులు ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
