27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

డిసిసిబి పాలకవర్గం రద్దు…. సంబరాల లో బ్యాంక్ ఉద్యోగులు

Must read

📰 Generate e-Paper Clip

 

 . . . మూడు దశాబ్దాలుగా ఆటెండర్ల నియామకాలు అంతా పాలకవర్గాలదే

. . .  7 సంవత్సరాలుగా యూనియన్ కార్యవర్గ నియామకానికి బ్రేక్

. . . బదిలీలలో పదోన్నతుల్లో పాలకులదే పెత్తనం

. . . బ్యాంక్ ఉద్యోగులు సాధించిన ప్రగతి… పాలకుల ఖాతాలోకి

 నిజామాబాద్, బతుకమ్మ :

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన జిల్లాలలో డీసీసీబీలు, కొత్త మండలాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుతో పాటు, ఏడాది కాలంపైగా పోడగింపులో కొనసాగుతున్న టెస్కాబ్, డిసిసిబి, పిఎసిఎస్ ల పాలకవర్గాలను రద్దు చేసింది. ఇటివల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రారంభించి, పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం బల్దియా ఎన్నికల తర్వాత పిఎసిఎస్ ల పున: వ్యవస్థీకరణ, పాలకవర్గాల ఎన్నికలకు కసరత్తు చేస్తుంది. దీనిలో భాగంగా ఈ నెల 19న రాష్ట్రంలో 9 డీసీసీబీలు, 904 పిఎసిఎస్ లను రద్దు చేస్తు అక్కడ పర్సన్ ఇంచార్జీలుగా నియమించింది ప్రభుత్వం. దానితో ఇటివల పదవీ కాలం పోడిగించినట్టే పోడిగించి ప్రభుత్వం అకస్మాత్తుగా రద్దు నిర్ణయం కొందరు పాలకులకు రుచించలేదు. మరి కొన్ని నాళ్ళు పధవి భోగ భాగ్యాలు అనుభవిద్ధం అనుకున్న కొందరికి ప్రభుత్వ నిర్ణయం అశనిపాతమైంది. కాని నిజామాబాద్ జిల్లాలో డీసీసీబీ రద్దుతో తెలంగాణ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉద్యోగులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానితో పాటు సంబరాలు చేసుకున్న విషయం చర్చనీయాంశంగా మారింది…….

DCCB board dissolved....bank employees celebrate

నిజామాబాద్ డీసీసీబీ( జిల్లా కేంద్ర సహకార బ్యాంక్) పాలకవర్గంరద్దు తో టీసీసీ బిఇఏ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. గత ముప్పై సంవత్సరాలుగా అటెండర్ ల నియమాకాలకు ఎనాడు పాలకవర్గాలు ప్రకటనలు జారీ చేయకపోవడమే. కేవలం పాలకవర్గం కనుసన్నుల్లో లోలోపల నియామకాలు చేస్తుండటం కారణం. నిజామాబాద్ డిసీసీబికి అనుబంధంగా ఉమ్మడి జిల్లాలో  63 శాఖలు ఉన్నాయి. ఆయా బ్రాంచ్ లో సుమారు 350 మంది ఉద్యోగులు మేనేజర్ లు, అసిస్టెంట్ మేనేజర్ లు, క్యాషీయర్ లు, అటెండర్ లు పనిచేస్తున్నారు. వారికి సంబంధించిన పదోన్నతులు, బదిలీలపై బ్యాంక్ అదికారులను కాదని పాలకులు చెప్పినవారికి పదోన్నతులు. అంతే కాకుండా బదిలీలకు పైరవీలకు ప్రాధన్యత. ఎంతల పరిస్థితి ఉందంటే డీసీసీబీలో 20 ఏళ్లుగా  పనిచేస్తున్న వారిని కదుపరు కానీ పైరవీలకు దూరంగా ఉన్నవారిని బదిలీలను చేయడం ప్రాధాన్యత కలిగిన ఉమ్మడి జిల్లాలో చివరి మండలాలకు ట్రాన్స్ ఫర్ లు చేసినట్లు ఉద్యోగులు వాపోతున్నారు. గత 7 సంవత్సరాలుగా యూనియన్ కొత్త కార్యవర్గం ఎన్నికలను అడ్డుకున్నట్టు తెలిసింది. ఏకంగా రాష్ట్ర నాయకత్వానికి చెప్పి జిల్లా కార్యవర్గ ఎన్నికల బ్రేక్ చేయడంతో తమ బదిలీలలో, పదోన్నతులలో రూల్స్ ఆప్ రిజర్వేషన్ లకు గండిపడుతున్న ఎవ్వరికి చెప్పుకోలేని సందిగ్ధంలో పడిపోయారు బ్యాంక్ అధికారులు…

పాలకవర్గం ను ప్రసన్నం చేసుకుంటే పదోన్నతి…. వారిని శరణు కోరితే ట్రాన్స్ ఫర్ లేదంటే అది లేదు. మెడికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న, సుదీర్ఘకాలంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కు దూరంగా ఉన్న వారు మండలాలను దాటి జిల్లా కేంద్రంలో వచ్చిన దాఖలాలు లేవు. బదిలీలలో ప్రధానంగా సీనియార్టీ కి మంగళం పాడటంతో పాటు  ఖద్దరు లీడర్లను ప్రసన్న చేసుకున్న వారికి ప్రధానంగా సామాజిక వర్గాల వారీగా కూడా తీవ్ర అన్యాయం జరిగిందని ఉద్యోగులు వాపోతున్నారు. బ్యాంక్ లో నానా తంటాలు పడి అప్పుల్లో ఉన్న బ్యాంక్ ను లాభాల్లోకి తెచ్చేది బ్యాంక్ ఉద్యోగులు అయితే దాని క్రెడిట్ అంతా పాలకవర్గం ఖాతాలోకి వేసుకుని సంబరాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ పిఏ నుంచి లాభాల బాట పట్టించేందుకు గాని రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల లాభాల్లోకి తెచ్చిన ఇతరల జిల్లాలో బోనస్ ఇస్తే నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని ఉద్యోగుల  తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా కొందరికి మాత్రం ఆర్ బి ఐ నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ లో ఉద్యోగాలను కల్పించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాలకవర్గం నిరంకుశపాలన పోవడంతోనే బ్యాంక్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నట్లు తెలిసింది. అంతే కాకుండా బ్యాంకు ఉద్యోగుల సంఘం ఎన్నికల తేనె తుట్టెను కదిపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.

 

More articles

Latest article