25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కర్క్యూమిన్ బాగుంది.. విక్రయాలు పెంచాలి..

Must read

📰 Generate e-Paper Clip

  • మోర్తాడ్ ఎఫ్పీఓకు పసుపు బోర్డు కితాబు

 

ఇందూర్, బతుకమ్మ:  మీరు పండించిన పసుపులో కర్క్యూమిన్ శాతం బాగుందని మోర్తాడ్ ఎఫ్పీఓకు పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, కార్యదర్శి భవాని శ్రీ కితాబునిచ్చారు. జిల్లా కేంద్రంలోని జీజీ కాలేజ్ మైదానంలో మూడు రోజుల పాటు కొనసాగే రైతు మహోత్సవంలో  వివిధ రకాల పంటలు, విత్తనాల స్టాల్స్ ఏర్పాటు చేసారు. 11 నెంబర్ స్టాల్ ను సందర్శించిన పసుపు బోర్డు కార్యదర్శి మాట్లాడుతూ రసాయనాలు లేకుండా పండించడం వల్ల పసుపు లో కర్క్యూమిన్ ఎక్కువగా ఉందని, దీనికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుందని చెప్పారు. కేరళలోనీ వ్యాపారులకు ఈ విషయం చెప్పి పిలిపించానని, వారికి సహకరిస్తూ విక్రయాలను మెరుగు పరచుకోవాలని సూచించారు. స్టాల్ వద్ద మోర్తాడ్ మండలంలో  సేంద్రియ తరహాలో సాగు చేసే రైతు కస్ప లక్ష్మినర్సయ్య, ఎఫ్పీఓలు, బోర్డు ఉద్యోగి మదన్, కేరళ వాసి, కొనుగోలుదారులు ఉన్నారు.

Curcumin is good.. sales should be increased..

More articles

Latest article