27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పంట కాలువ పూడ్చివేత..

Must read

📰 Generate e-Paper Clip

  • నీళ్లు రాకుండా అడ్డుపడుతున్నాడంటూ రైతుల ఆవేదన

 

బతుకమ్మ, కోటగిరి : తమ పంట పొలాలకు నీళ్లు రాకుండా పంట కాలువను పూడ్చి వేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో 1997 సంవత్సరంలో అప్పటి టీడిపి ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి లేని నిరుపేద దళిత కుటుంబలకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూములను పంపిణి చేశారు.అందులో భాగంగా పోతంగల్ మండలం జల్లపల్లి గ్రామ శివారులో  సుమారు రెండు వందల ఎకరాల వ్యవసాయ భూములకు సాగు నీటిని అందించడం కోసం ఏర్పాటు చేసిన పంట కాలువలను  ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన ఒక రైతు  పూడ్చివేసి తమ పంట భూములకు నీళ్లు రాకుండా చేస్తున్నాడని వారం రోజుల క్రితమే సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన  పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి పంట కాలువను పునరుద్దరించి  తమకు సాగు నీటిని అందించాలని కోరారు.

  • ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమే : ఇరిగేషన్ ఏ ఈ సత్యనారాయణ

పంట కాలువను పూడ్చివేసిన విషయం పై ఫిర్యాదు అందిందని  పంట కాలువను పూడ్చివేసిన రైతును విచారించగా తన పంట పొలంలో నీళ్లు చేరుతుండడంతో కాలువను పూడ్చి దారి దారి మళ్లించినట్లు సదరు  రైతు తెలిపినట్లు ఆయన అన్నారు. పంట కాలువ దారి మళ్లించడంతోనే  క్రింద ఉన్న రైతుల నీళ్లు వెళ్లడం లేదని  వెంటనే తమ సిబ్బందిని పంపి  కాలువను పునరుద్ధరించి రైతులకు సాగునీరు అందించే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

Crop canal filling..

More articles

Latest article