. . . విజేతలకు నగదు బహుమతులు ప్రదానం
కోటగిరి బతుకమ్మ :
సంక్రాంతి పండుగ సందర్భంగా కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో ఛాంపియన్ ట్రోఫీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నమెంట్ లో సుమారు 40 టీంలు పాల్గొన్నాయి. అందులో విజేతగా నిలిచిన వర్ని మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన టీం విన్నర్ ప్రైజ్ మనీ రూ. 22222, కొత్తపల్లి తాండ రన్నర్ ప్రైజ్ మనీ రూ.11111 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఎస్సై సునీల్, విద్యుత్ శాఖ ఏ.ఈ బుచ్చిబాబు ఆదివారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై సునీల్ మాట్లాడుతూ చదువుతో పాటు యువత క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు ఎక్కువగా ఉంటారని, వారిని వెలికి తీయడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, రమణారెడ్డి, కొండారెడ్డి, అప్పిరెడ్డి, సాయిలు, సుదర్శన్, అశోక్ రెడ్డి, కృష్ణారెడ్డి, రమణారెడ్డి,హన్మంతు, క్రికెట్ ఆర్గనైజర్స్ బబ్లు రామకృష్ణ గోవర్ధన్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.