- పిఆర్టియు మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్
బతుకమ్మ, ఏర్గట్ల: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా వెంటనే సిపిఎస్(కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి అనే డిమాండ్‌తో పిఆర్ టి యు ఏర్గట్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా పోస్టర్ లను మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ సిపిఎస్ విధానం ఉద్యోగుల సంక్షేమానికి వ్యతిరేకంగా ఉందని ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తోందని అన్నారు. అందువల్ల, పాత పెన్షన్ కు ఎటువంటి ప్రత్యామ్నాయం సిపిఎస్, యుపిఎస్ విధానాల వల్ల లేదు అని తిరిగి ఓపిఎస్ అమలు కావాల్సిందే అని తెలుపుతూ చట్టసభల్లోకి వెళ్ళిన రాజకీయ నాయకులకు ఒక సంవత్సరం పదవిలో ఉంటే వారికి జీవితాంతం పెన్షన్ ఇస్తున్నప్పుడు ఉద్యోగిగా కొన్ని సంవత్సరాల పాటు వారు ఉద్యోగం లో చేసిన సేవకు గుర్తుగా దేశవ్యాప్తంగా కొన్నిరాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్,రాజస్థాన్,జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ పంజాబ్ సిపిఎస్ రద్దును అమలుపరిచినట్టే మన రాష్ట్రంలో కూడా ఎన్నికలకు ముందు తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సిపిఎస్ రద్దు చేసి 2004 కంటే ముందు ఉద్యోగ,ఉపాధ్యాయులకు ఇచ్చిన విధంగా జీవిత భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. అలాగే టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పిఆర్ టియు రాష్ట్ర శాఖ, పిఆర్ టియు టీఎస్ కాంటెస్టెడ్ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వారిసూచన మేరకు అన్ని జిల్లాల్లో,మండలాల్లో తేదీల వారీగా కార్యాచరణ కార్యక్రమాలు తెలియజేస్తూ సెప్టెంబర్ 1న హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నామని కావున ఉపాధ్యాయులు ఈ ధర్నాకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గటాడి భాస్కర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేందర్,జిల్లా కార్యదర్శి సాదుల గంగాధర్, మండల మహిళా ఉపాధ్యక్షురాలు మమత, మండల కార్యదర్శి ఇమాముద్దీన్ మండల పరిధిలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
