సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి
పిఆర్టియు మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ బతుకమ్మ, ఏర్గట్ల: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా వెంటనే సిపిఎస్(కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి అనే డిమాండ్‌తో పిఆర్ టి యు ఏర్గట్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా పోస్టర్ లను మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ సిపిఎస్ విధానం ఉద్యోగుల సంక్షేమానికి వ్యతిరేకంగా ఉందని ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తోందని అన్నారు....