సఖీ సెంటర్ ను సందర్శించిన సీపీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య మంగళవారం నగరంలోని సఖీ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా సఖీ సెంటర్ లో ఉన్న బాధిత మహిళలతో మాట్లాడారు. గృహహింస, చీటింగ్ కేసు బాధితులతో మాట్లాడారు. 181 కాల్స్ డాష్ బోర్డ్, మిషన్ శక్తి డాష్ బోర్టును చెక్ చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. భాధిత మహిళలకు అన్ని రకాల సేవలని సకాలంలో అందిస్తున్నారని సిబ్బందిని ప్రశంసించారు. సఖి సెంటర్, భరోసా, ఐసీపీఎస్ అన్ని ఒకే దగ్గర ఉంటే బాగుంటాయని సూచించారు....