27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గ్రేవ్ క్రైమ్ కేసుల దర్యాప్తుపై సీపీ సమీక్షా సమావేశం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన గ్రేవ్ క్రైమ్ కేసుల దర్యాప్తు పురోగతి , నిందితుల అరెస్టులు , పెండింగ్ కేసుల స్థితిగతులు , ఛార్జ్‌షీట్ల దాఖలు , కోర్టు విచారణలపై పోలీసు కమిషనర్ సాయిచైతన్య సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం సీపీ సాయి చైతన్య  సర్కిల్ ఇన్‌స్పెక్టర్లతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన హత్య , హత్యాయత్నం , దోపిడీ , చోరీ , మహిళలు , చిన్నారులపై నేరాలు , పోక్సో , మోసం , అపహరణ తదితర గ్రేవ్ క్రైమ్ కేసులను ఒక్కొక్కటిగా సమీక్షించారు. దర్యాప్తు పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని అధికారులను ఆదేశించారు.కేసుల దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా సాంకేతిక ఆధారాలు , సీసీటీవీ ఫుటేజ్ , కాల్ డేటా విశ్లేషణ , ఫోరెన్సిక్ సాక్ష్యాలు మరియు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ప్రతి కేసులో సాక్ష్యాధారాలను పటిష్టంగా సేకరించడం ద్వారా కోర్టుల్లో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మహిళలు , చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించిన కేసులను అత్యంత ప్రాధాన్యతతో దర్యాప్తు చేయాలని , బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. అలాగే పెండింగ్ వారెంట్లు , పెండింగ్ సమన్లు అమలు చేయడంతో పాటు పరారీలో ఉన్న నిందితులను గుర్తించి అరెస్టు చేయాలని సూచించారు. నేర నియంత్రణలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయాలని , హాట్‌స్పాట్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు మరియు నేరచరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు.ప్రజలకు సత్వర న్యాయం అందించడం , నేరాల నియంత్రణ , ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని సూచించారు.ఈ సమావేశంలో నిజామాబాదు , ఆర్మూర్ , బోధన్ , ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాష్ , వెంకటేశ్వర్ రెడ్డి , శ్రీనివాస్ , మస్తాన్  అలీ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి , మల్లేష్ ,  సి.సి.ఆర్.బి  ఇన్స్పెక్టర్ అంజయ్య , సీఐలు ,  ఎస్. హెచ్. ఓ లు,  ఐటీ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article