25.5 C
Hyderabad

ఈద్గాల వద్ద బందోబస్తును పరిశీలించిన సీపీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాదు క్రైమ్, బతుకమ్మ  :  బక్రీద్ పర్వదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఈద్గాల వద్ద బందోబస్తును శనివారం సీపీ సాయి చైతన్య పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్, బోధన్ లోని నర్సిరోడ్డు ఈద్గాలను సీపీ పరిశీలించారు. అనంతరం ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఈద్గాల వద్ద బందోబస్తును ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఆదేశించారు. సీపీ వెంట ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఆర్బీ ఏసీపీ రవీందర్, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.


CP inspects security at Eidgala

More articles

Latest article