27.5 C
Hyderabad
Friday, July 31, 2026

వ్యాపార సముదాయాలను పరిశీలించిన సీపీ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి

 

. . . వ్యాపారస్తుల వివరాలు సేకరించాలి

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాబోయే రంజాన్ పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య నెహ్రూ పార్క్,శంభుని గుడి,హైమది బజార్,ఖిల్లా రోడ్డు, బోధన్ బస్టాండ్ పరిసర ప్రాంతాలను బుధవారం కాలినడకన కలియ తిరిగి రాబోయే రోజులలో వివిధ వ్యాపారస్తులు నెలకొల్పే షాపులు గురించి వివరాలు సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకున్నారు.

 

CP inspects business complexes

 

వ్యాపారస్తులకు వ్యాపార సమదాయులు నెలకొల్పడానికి స్థలాన్ని ఏ విధంగా కేటాయించాలో, ఏ ప్రదేశంలో కేటాయించాలో,ట్రాఫిక్ జామ్ కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అధికారులకు వివరించారు. అలాగే వ్యాపారస్తుల వివరాలు సేకరించాలని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీ.సీ కెమెరాలు ఉండేవిధంగా , ప్రజలకు తగు సూచనలు ఇచ్చే విధంగా పోలీస్ శాఖ తరపున సౌండ్ సిస్టంను ఏర్పాటు చేయాలని, పార్కింగ్ వివరాలు సంబంధిత ట్రాఫిక్ అధికారాలకు, లా అండ్ ఆర్డర్ అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసిపి, నిజామాబాదు డివిజన్ ఇన్చార్జి మస్తాన్ అలీ, ట్రాఫిక్ సిఐ ప్రసాద్, వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి, టౌన్ సర్కిల్ సి.ఐ శ్రీనివాసరాజ్, రెండవ టౌన్ ఎస్.హెచ్.ఓ ముజాహిద్ తదితరులు ఉన్నారు.

CP inspects business complexes

 

 

More articles

Latest article