26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ అభిషేక్ మహంతి

Must read

📰 Generate e-Paper Clip

కరీంనగర్, బతుకమ్మ : స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. కౌంటింగ్ పరిసర ప్రాంతంలో సుమారు 400 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాల వెలువడే వరకు మూడు షిఫ్ట్ ల్లో బందోబస్తు కొనసాగుతుందన్నారు. గుర్తింపు కార్డు కలిగిన వ్యక్తులకు మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.

More articles

Latest article