విద్యుదాఘాతానికి ఆవు మృతి

0 14,549

మద్నూర్, బతుకమ్మ:  మద్నూర్ మండలం కొడిచిర గ్రామ శివారులోని పొలంలో  బుధవారం ఉదయం  ఈదురు గాలులకు కరెంటు తీగలు తెగిపడటంతో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై ఆవు మృతి చెందినట్లు రైతు బేతె సంజు తెలిపారు. ఆవు విలువ సుమారు రూ.35 వేలు ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని రైతు బేతె సంజు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.