28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రాష్ట్రంలో నడుస్తున్నది కోవర్టు పాలన

Must read

📰 Generate e-Paper Clip

రేవంత్ సవాల్ ని స్వీకరిస్తున్నా

రైతుల విషయంపై చర్చ పెడతాం

మాజీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్​,బతుకమ్మ :  రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు కోవర్టు పాలన అని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యనించారు. చంద్రబాబు నాయుడి కోవర్టు రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణను ఏలుతున్నాడని విమర్శించారు. ఈసందర్భంగా నిజాలు మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. వ్యవసాయాన్ని పండుగలా చేసింది ఎవరో.. తెలంగాణలో ఏ రైతును అడిగినా చెప్తారని అన్నారు.  ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి తెలంగాణను నంబర్ వన్ చేసిందో ఎవరో అందరికీ తెలుసు అన్నారు. రేవంత్ రెడ్డికి అన్ని తెలుసు కానీ తెలియనట్లు నటిస్తున్నాడని విమర్శించారు. రేవంత్ ప్రతి సభలో సవాళ్లు, బూతులు, డైలాగులు కామన్ అని అన్నారు. శుక్రవారం జరిగిన సభలో తన ప్రస్తావన తీసి మరీ సవాల్ విసిరాడని,  రేవంత్ సవాల్ ని స్వీకరిస్తున్నాని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుల విషయంలో ఎవరేం చేశారో ఎక్కడ చర్చ పెడదాం చెప్పు రేవంత్ అని ప్రశ్నించారు. ఈనెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కి తాము చర్చకు వస్తామని..  మీరు సిద్ధమా.. రేవంత్ రెడ్డి  అని ప్రశ్నించారు.

More articles

Latest article