25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

సోనియా గాంధీకి కోర్టు నోటీసులు

Must read

📰 Generate e-Paper Clip

 వెబ్ న్యూస్, బతుకమ్మ :  కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి కోర్ట్ నోటీసులు జారీ అయ్యాయి. భారతదేశ పౌరసత్వం రాకముందే ఆమె పేరును ఓటరు జాబితాలో చేర్చారన్న ఆరోపణలపై  పిటిషన్ దాఖలైన విషయం తెలిసింది. ఈ పిటిషన్ పై మంగళవారం రౌజ్ అవెన్యూ లోని సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది.  ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది పవన్ నారంగ్ వాదనలు వినిపించారు. సోనియా గాంధీకి పౌరసత్వం రాకముందే ఆమె పేరును ఓటరు జాబితాలో చేర్చారని అందుకోసం అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై పునః పరిశీలన అవసరమన్నారు. దీంతో  సెషన్స్  కోర్టు సోనియా గాంధీకి నోటీసులు జారీచేసింది.

More articles

Latest article