బతుకమ్మ, జుక్కల్ : మండలంలోని పెద్ద ఏడ్గ గ్రామానికి చెందిన యువ డాక్టర్ శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితం గుండె పోటుతో మరణించారు. విషయం తెలుసుకుని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బుధవారం వారి ఇంటికి వెళ్లి శ్రీనివాస్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
