ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని శివరాం మహారాజ్ గుడి వద్ద ఆల్ ఇండియా బంజారా సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. దేశంలో బంజారాలకు జరుగుతున్న అన్యాయాల పట్ల దేశవ్యాప్తంగా ఐదు డిమాండ్స్ తో తమ హక్కుల కొరకు పోరాడబోతున్నామని అందుకే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.మొదటగా అంతిరామ్ బాబా ఆస్తులను కాపాడాలని,శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ కు జాతీయస్థాయిలో సెలవు దినంగా ప్రకటించాలని కోరనున్నట్లు తెలిపారు.భారతదేశంలో 15 కోట్లు బంజారాలు నివసిస్తున్నట్లు తెలిపారు,లక్కీష బంజారా విగ్రహాన్ని ఆల్ ఇండియా గేటు వద్ద గాని పార్లమెంట్లో గాని ప్రవేశపెట్టాలన్నారు.ఎస్సీ ఎస్టీ ఉన్న దగ్గర అదే మాదిరిగా ఉండనివ్వాలని,డీనోట్ సైడ్ దగ్గర ఉన్న వారిని బీసీలుగా పరిగణించాలని,తపశ్రీ రామ్ రావు మహారాజ్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.పూజారులు సుమారుగా 150 మంది కర్ణాటక,తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్,మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి పాల్గొననున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో నేషనల్ బంజారా నాయకులు శంకర్ మోహన్,ఉపాధ్యక్షులు కిషన్, సోమ్లా నాయక్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి,గవర్నర్లకు వినతి పాత్రలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా కమిటీ సభ్యులు శివరాం మహారాజ్, నాయకులు పాల్గొన్నారు.
