అనుమతులు లేకుండానే అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు

0 8,250

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

విద్యాశాఖ నుంచి అనుమతులు లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని టీఎస్ఏ విద్యా సంఘం నాయకులు జిల్లా ఏడి ని కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఫీజు రాయితీలంటూ, ఇంటర్నేషనల్ అంటూ, సీబీఎస్ఈ పాఠశాలలు మావి అంటూ రకరకాల పేర్లు చెప్పి విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అడ్మిషన్లు చేపడుతున్నారని తెలిపారు. ఆల్ ఫోర్స్, నారాయణ సీబీఎస్సి, శ్రీ చైతన్య సీబీఎస్సీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటూ రకరకాల పేర్లు చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెబుతూ, మా విద్యాసంస్థలో మార్కులే ధ్యేయంగా పని చేస్తామని అబద్ధపు ప్రచారాలు చేపడుతూ, నగరవ్యాప్తంగా విద్యాసంస్థల అడ్మిషన్లు ఓపెన్ అంటూ, హోర్డింగ్ లు ఏర్పాటు చేశారన్నారు. మరోపక్క జిల్లా విద్యాధికారి ఎలాంటి అడ్మిషన్లకు పర్మిషన్ ఇవ్వలేదని, 2026-27 విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదని ఉత్తర్వులు జారీ చేసినా, ఇవేమీ ఈ కార్పొరేట్ విద్యాసంస్థలకు పట్టనట్టు, వారి ధనార్జన కోసమే ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో కొద్దో గొప్పొ నడుస్తున్న బడ్జెట్ పాఠశాలల నడ్డి విరిచేలాగా వీరి చర్యలు ఉన్నాయని తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.