29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కాలువల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ :  శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ 6 గేట్ల ద్వారా 12301 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల కొనసాగుతుంది. అలాగే ప్రాజెక్ట్ ప్రధాన కాలువలు అయినటువంటి కాకతీయ కాలువ ద్వారా 6800, ఎస్కేప్ గేట్ల ద్వారా 1200, సరస్వతి కాలువ ద్వారా 500, లక్ష్మీ కాలువ ద్వారా 150, వరద కాలువ ద్వారా 8542 క్యూసెక్కులు, మిషన్ భగీరథ 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 30, 703 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. కాలువల ద్వారా 30,703 క్యూసెక్కుల నీటిని  వదిలేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు నీటి మట్ట నిలకడగా ఉంది.  ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 80.501 టిఎంసి అన్ని నిల్వ ఉంటుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నాలుగు టార్గెట్ ద్వారా 36.17 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని జెన్ కో డీ ఈ ఈ శ్రీనివాస్ తెలిపారు.

More articles

Latest article