బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో మహిళా సాధికారత విభాగం, ఐక్యుఏసి మరియు ఎన్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకుంటూ, ముందు తరాలకు అందించాలని కళాశాల ప్రిన్సిపాల్ కె.అశోక్ విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో విద్యార్థినిలు తాము తయారుచేసిన బతుకమ్మలను ప్రదర్శించి, బతుకమ్మ సంబరాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐ క్యు ఏ సి కోఆర్డినేటర్ రమేష్ బాబు, మహిళా సాధికారత విభాగం కోఆర్డినేటర్ వై. రేవతి, అధ్యాపక,అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.

