కమ్మర్ పల్లి, బతుకమ్మ : మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలోని భాదిత కుటుంబాలను గురువారం కాంగ్రెస్ పార్టీ కానిస్టెన్సీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని గాంధీనగర్ కు చెందిన రవి ప్రమాదవశత్తు చెట్టుపై నుండి పడి రెండు కాళ్ళు విరుగగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఖర్చుల నిమిత్తం రూ. 10వేలు అందజేశారు. మండలంలోని ఉప్పులూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ ఇటీవలే అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. హాసకొత్తూరు గ్రామానికి చెందిన ఏనుగు భూమన్న ఇటీవలే అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను మరణించగా వారి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
