29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పాలెం పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుక

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస, జనరల్ నాలెడ్జ్ పై క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. మంచి ప్రతిభ చూపించిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మహేష్ కుమార్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, నరసింహస్వామి, రాజేందర్, జయశ్రీ, త్రివేణి, రాజేశ్వరి, మమత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Constitution Day Celebration at Palam School

More articles

Latest article