27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నియోజకవర్గ అభివృద్దే లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్, బతుకమ్మ : నియోజకవర్గ అభివృద్దే తన లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాదు అర్బన్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల పై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా సమావేశం నిర్వహించారు. నాగారంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మరమ్మతులకు విడుదలైన 1.25 కోట్ల రూపాయలతో వెంటనే పనులు ప్రారంభించి అర్హులైన లబ్దిదారుల జాబితా కొత్తగా ఎంపిక చేసి వారికీ ఇండ్లను కేటాయించాలని సూచించారు. నగర ప్రజా ఆరోగ్యం, అవసరాలకు అనుగుణంగా నిర్మించిన అహ్మది బజారు, ఖలీల్ వాడిలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల పనులు అతి త్వరలో  పూర్తి చేసి ప్రజాపయోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. టీయూఎఫ్ఐడిసీ ఫండ్ కింద నియోజకవర్గనికి విడుదల అయిన 60 కోట్ల రూపాయలకు టెండరింగ్ పిలిచి త్వరతగతిన డివిజన్ల వారిగా పనులు ప్రారంభించాలని కోరారు. నగరంలో కబ్జాలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు ఇబ్బందులకు గురి అవుతున్నారని, కబ్జాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు.  ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫుట్ పాత్ కబ్జాలు, రోడ్లపై విచ్చలవిడిగా వ్యాపారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తోపుడు బండ్లతో రోడ్ల పై వ్యాపారం చేస్తున్న వారికీ ప్రత్యేకంగా ఒక స్థలం కేటాయించాలని సూచించారు. స్మార్ట్ సిటీ కోసం కేంద్ర నాయకత్వంతో, ఎంపీ తో కలిసి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్మార్ట్ సిటీ విధివిధానాలకు అనుగుణంగా ఇందూర్ నగరాన్ని తీర్చిదిద్దే బాధ్యత అందరిపైన ఉందని అందుకు ప్రజలందరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్ ఈఈ సురేష్, డీఈ ప్రవీణ్, మున్సిపల్ ఈఈ మురళి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article