కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న విశ్వనాథంను సస్పెండ్ చేస్తూ ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు సీజ్ చేసిన బైక్ ను అనధికారికంగా కానిస్టేబుల్ విశ్వనాథం వినియోగించడంపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో విచారించిన ఎస్పీ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. నీతి, నిజాయితీ, నైతికత, నియమాలను పోలీసు సిబ్బంది ఖచ్చితంగా పాటించాలన్నారు. స్టేషన్ కు చెందిన వాహనాన్ని అనుమతి లేకుండా వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం సరైంది కాదన్నారు. క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తప్పవని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.
