నల్లొండ, బతుకమ్మ : నల్గొండ జిల్లా చిట్యాల మండలం కాపర్తి గ్రామంలోని ఓ డ్రైనేజీలో వందల బ్యాలెట్‌పేపర్ల దర్శనమిచ్చాయి. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ త్రిపాఠి నల్గొండ ఆర్డీవోను ఈఘటనపై విచారించేందుకు అధికారిగా నియమించారు. ఈఘటనపై ఆర్వోను కలెక్టర్ సస్పెన్షన్ చేశారు. ఈసందర్భంగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. కాం గ్రెస్‌ది బ్యాలెట్ చోరీ అని ఆరోపించారు. బ్యాలెట్‌పేపర్లు తమ అభ్యర్థికి సంబంధించినవే అన్నారు. తమ అభ్యర్థి గెలుపోటములను తారుమారు చేశారని, కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యం చేసిందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.

