నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఈనెల 18న చేపట్టిన రాష్ట్ర బంద్ కు జిల్లా కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశంలో రాజ నరేంద్ర గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బిసీ రిజర్వేషన్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని తెలియజేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజా నరేందర్ గౌడ్ మాట్లాడుతూ. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయన్నారు.కానీ ఈ బిల్లు గవర్నర్ పెండింగ్ లో ఉంచారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత హైకోర్టు స్టే విధించడం,సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును అమలు చేయాలని చెప్పడం బాధాకరమన్నారు.బీసీలకు రిజర్వేషన్లు పెంచడంలో బీజేపీ నాయకత్వంలోని 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని తెలిపారు.బీసీ రిజర్వేషన్ల పెంపు న్యాయమైన డిమాండ్ అని,కుట్రలు చేసి రిజర్వేషన్ల పెంపును అడ్డుకోవడం సరికాదన్నారు.42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాల జేఏసీ ఈనెల 18న ఇచ్చిన రాష్ట్ర బందు పిలుపుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని,బంద్ లో పాల్గొంటామని తెలియజేశారు. బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపుని జయప్రదం చేయాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ నగర అధ్యక్షులు నాగరాజు, డి నారాయణరావు (నాని), మాజీ నిజామాబాద్ జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు డిస్టిక్ యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ నరేందర్, 47 డివిజన్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
