28.8 C
Hyderabad
Monday, August 3, 2026

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై కాంగ్రెస్ భారీ ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

 

జుక్కల్, బతుకమ్మ :

 

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జుక్కల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున నాయకత్వంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు, యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నీట్ పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకతను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖండేబల్లూర్ సర్పంచ్ కృష్ణ, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయగౌడ్, డీసీసీ జనరల్ సెక్రటరీ ఇమ్రాన్ ఖాన్, దోసపల్లి సర్పంచ్ మారుతి, బస్వాపూర్ సర్పంచ్ సురేష్ గోండా, హంగర్గ సర్పంచ్ నర్సింలు, సావర్‌గావ్ సర్పంచ్ కపిల్, కంటాలి సర్పంచ్ నాగనాథ్, మహిబాపూర్ సర్పంచ్ అశోక్ రెడ్డి, సంతోష్ అప్పా, రుమాలు సేట్, గంగు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article