నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై కాంగ్రెస్ భారీ ధర్నా

  జుక్కల్, బతుకమ్మ :   నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జుక్కల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున నాయకత్వంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు, యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా...