28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్ ఎస్సీ కార్యవర్గం రద్దు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ కు సంబంధించిన కార్యవర్గం రద్దు చేయడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారని నగర కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బొలి రామకృష్ణ అన్నారు. ముందుగా జిల్లా అధ్యక్షుల ఎంపిక ఉంటుందని, ఇందుకు గాను జిల్లాల వారీగా పరిశీలకులను నియమించడం జరిగిందని, అందులో భాగంగా నిజామాబాద్ పరిశీలకులుగా చుక్కా శ్రీనివాస్ ని నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. ఆశావాహులైన దళిత నాయకులు తమ బయోడేటాను దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. త్వరలో జిల్లా కమిటీలు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని, పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

More articles

Latest article