29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

’స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవు‘

Must read

📰 Generate e-Paper Clip

పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు

కొత్తగూడెం  ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

వెబ్ న్యూస్, బతుకమ్మ  :  రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి, కొత్తగూడెం  ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్య లు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేకపోయిందని వ్యాఖ్యనించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ఉన్న చోటే తాము పోటీ చేస్తామని.. మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీని కలుపుకుపోతామని తెలిపారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై పార్టీలో చర్చలు జరుపుతున్నామన్నారు.

More articles

Latest article