28.8 C
Hyderabad
Monday, August 3, 2026

బాధిత కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ ..

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామానికి చెందిన తుమ్మల రాజయ్య సతీమణి గంగవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఫోన్ లో పరామర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ తో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా నవీన్ గౌడ్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తో మృతురాలి భర్త రాజయ్య తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులలో ఖర్చు చేసిన బిల్లులను జాగ్రత్తగా ఉంచుకోవాలని సీఎంఆర్ఎఫ్ స్కీం లో ఆర్థిక సహాయాన్ని అందిస్తామని బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు. పార్టీ పరంగా సైతం ఆదుకుంటామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బైరి రవి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు ఈర్ల సాయందర్, బూత్ కమిటి సభ్యులు పూజ్యం వీరయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ప్రసాద్, ఉపాధ్యక్షులు తుమ్మల శ్రీనివాస్, ముడిగం శ్రీనివాస్ రెడ్డి, రవికుమార్, కమ్మరి పెద్ద గంగారం, శివ, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article