29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

చొప్పదండి ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామానికి చెందిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం  ను తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు  శుక్రవారం  కలిసి దసరా జంబి పెట్టి శుభాకాంక్షలు  తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం స్థానిక సంస్థల ఎన్నికల గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కొద్దిసేపు ముచ్చటించారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను గడపగడపకు వివరించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో  కష్టపడి అభ్యర్థులను గెలిపించుకోవాలని,మండలంలో ని  13 ఎంపీటీసీ స్థానాల్లో మెజార్టీ ఎంపిటిసి స్థానాలను గెలిపించుకున్నట్లయితే ఎంపీపీ పదవితో పాటు జెడ్పిటిసి  సభ్యున్ని గెలిపించుకోవాలని మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో  ఏ జి పి పసుల కృష్ణ,  బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య,రేవంత్ రెడ్డి మిత్రమండలి అధ్యక్షులు గూడ విజయ్ రెడ్డి, ఏఎంసి వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి, ఏఏంసి డైరెక్టర్లు మెండే శ్రీనివాస్ యాదవ్,సూడిది రాజేందర్,మాజీ సర్పంచులు ముక్క శంకర్, రవీందర్ గుప్తా,మేడిపల్లి దేవానందం ,కదిరి శ్రీనివాస్ గౌడ్,  గొల్లపల్లి మల్లేశం,కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్రెడ్డి ,   జర్నలిస్టులు పెంటం శ్రీనివాస్ యమగొండ పద్మా రెడ్డి లు  ఉన్నారు.

More articles

Latest article