చొప్పదండి ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామానికి చెందిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ను తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం కలిసి దసరా జంబి పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం స్థానిక సంస్థల ఎన్నికల గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కొద్దిసేపు ముచ్చటించారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను గడపగడపకు వివరించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో కష్టపడి అభ్యర్థులను గెలిపించుకోవాలని,మండలంలో ని 13 ఎంపీటీసీ స్థానాల్లో...