సీఎం ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
లింగంపేట్, బతుకమ్మ : లింగంపేట్ మండలం లింగంపల్లి గ్రామ సమీపంలోని పాములవాగు వంతెన వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్మోహన్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి వల్ల లింగంపల్లి ఖుర్ద్ అడివిలింగాల్ హై లెవల్ బ్రిడ్జ్ పునర్నిర్మాణానికి 8.50 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయినట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా లింగంపేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిరాం యాదవ్ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా...