బాన్సువాడ , బతుకమ్మ : బీర్కూరు మండల కేంద్రానికి చెందినవారితోపాటు కిష్టాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధిక మెజార్టీ తీసుకురావాలని భాస్కర్ రెడ్డి సూచించారని నాయకులు తెలిపారు. భాస్కర్ రెడ్డిని కలిసిన వారిలో సీనియర్ నాయకులు శశికాంత్, శ్రీను పటేల్, బాన్సువాడ సాయిలు, అంజయ్య, మంద గంగాధర్, అరికెల హన్మాగౌడ్, చాకలి బోయిన శ్రీనివాస్, బాలుగొండ, పర్సు రవి, పర్సు బీరుగొండ, కానూరి భరత్, కన్నమోల లక్ష్మణ్, జోగు మోహన్, నారం వెంకటి, అట్కరి పండరి, అరికెల చందుగౌడ్, కర్ణం శ్రీనివాస్, గైని చిరంజీవి, చెవిటి పీరయ్య, సాలె నర్సింలు తదితరులు ఉన్నారు.
