28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

గన్నవర్షిణిని సన్మానించి కాంగ్రెస్ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ :  జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్ బాల్ క్రీడాకారిణి గన్న వర్షిణిని నిజామబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సొప్పరి వినోద్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి సన్మానించారు. జక్రాన్ పల్లి గ్రామంలో యువజన కాంగ్రెస్ నిజామాబాద్ రూరల్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెలలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన 37వ సబ్ జూనియర్ జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలలో బంగారు పతకం సాధించిన సందర్భంగా గన్న వర్షిణీని సన్మానించి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ నర్సారెడ్డి మాట్లాడుతూ జాతీయ పోటీలలో జక్రాన్ పల్లి  గ్రామ క్రీడాకారిని బంగారు పతకం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో భారత జట్టు తరఫున రాణించాలని అన్నారు.

More articles

Latest article