గన్నవర్షిణిని సన్మానించి కాంగ్రెస్ నాయకులు

ఆర్మూర్, బతుకమ్మ :  జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్ బాల్ క్రీడాకారిణి గన్న వర్షిణిని నిజామబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సొప్పరి వినోద్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి సన్మానించారు. జక్రాన్ పల్లి గ్రామంలో యువజన కాంగ్రెస్ నిజామాబాద్ రూరల్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెలలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన 37వ సబ్ జూనియర్ జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలలో బంగారు పతకం సాధించిన...