- ఓట్ చోరీ కాదు అది రాహుల్ గేమ్ చోరీ
- బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కాకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకీ ఇవ్వాలి
- బీసీలకే 42 శాతం రిజర్వేషన్లు దక్కాలి
- బీజేపీని అడ్డుకునేందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి
- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జండా ఎగురవేయడం ఖాయం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు
నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అమలుకు నోచని హామీలను ఇచ్చిందని బీజేపీపై అవి చేస్తున్న ఆరోపణలు అబద్దాలకు పరాకాష్ట అని, అబద్దాలకు కాంగ్రెస్ తల్లిలాంటిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ జిల్లా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 32 లక్షల మంది రైతులను మోసం చేసినా మోడి సర్కార్ రూ.6 వేల చొప్పున పంటల సాగుకు సహాయం అందించిందన్నారు. ఆరు గ్యారంటీల పేరిట ప్రజలను మోసం చేసి అభివ`ద్ది పనులను నిలిపివేశారన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారని, ఇప్పటి వరకు రాష్ట్రంలో 73 ఇండ్లు మాత్రమే పూర్తి కావచ్చయన్నారు. ఓట్ చోరి అంటున్న కాంగ్రెస్ నేతలు 8 ఎంపీ సీట్లు ఎలా గెలిచిందో చెప్పాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఓట్ చోరి అంటున్నారని కాదు అది రాహుల్ బ్రెయిన్ చోరి అని వ్యాఖ్యానించారు. బీజేపీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని, కాకపోతే అది మొత్తం బీసీలకే దక్కాలని కాంగ్రెస్ పార్టీ పది శాతం ముస్లీంలకు, 30 శాతం బీసీలకు ఇచ్చేందుకు నాటకాలు ఆడుతుందన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత కత్రిమమేనని అది కాంగ్రెస్ పార్టీ స`ష్టిచిందేనని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒక్కటేనని అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసును, ఓటుకు నోటు కేసును పరస్పరం సహకరించుకుంటున్నాయని వాటికి చిత్తశుద్ది ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకీ అప్పగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, రైల్వేలైన్లు మొదలుకుని రైతు వేదికలు, స్మశాన వాటికలకు చివరకు రేషన్ బియ్యం 5 కిలోలు ఇస్తుంది బీజేపీయేనని అన్నారు. బీజేపీ చేస్తున్న అభివ`ద్ది సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని, 2028లో రాష్ట్రంలో బీజేపీ జండా ఎగురడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ మోడిని కన్వర్ట్ బీసీ అంటున్నారని కాంగ్రెస్ నాయకులు రాబోయే రోజుల్లో బీజేపీలోకి ఎంత మంది కన్వర్ట్ అవుతారో చూసుకోండని సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికలకు ముందే ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారని రామచంద్రరావు అన్నారు.

- ఏ ఎంపీ చేయని పని ధర్మపురి అరవింద్ చేశారు..
రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ఎంపీ చేయని పని ధర్మపురి అరవింద్ చేశారని ఆయన సేవలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కొనియడారు. సోమవారం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పుట్టిన రోజు పురస్కరించుకుని బీజేపీ బూత్ కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ చేతుల మీదుగా ఏడి పౌండేషన్ ద్వారా ఎంపీ అరవింద్ బీజేపీ కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు సహాయ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ బహుశ రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ ఏ ఎంపీ కూడా బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సంక్షేమం కోసం బీమా చేయించినట్లు తాను గుర్తించలేదన్నారు. బూత్ స్థాయి కార్యకర్తలకు బీమా కార్యక్రమాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించడం అందుకు నిదర్శనమన్నారు. బీజేపీలోని బూత్ స్థాయి కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా కన్నీరు వచ్చినా తాను ఉన్నానని అరవింద్ తన సేవా కార్యక్రమాల ద్వారా నిరూపించారన్నారు. 176 మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులను సొంత డబ్బులను వెచ్చించి వైద్యం చేయించడం అరవింద్ మానవత హ`దయానికి నిదర్శనమన్నారు. కార్యకర్తల కుటుంబాలకు భీమా కల్పించడంతో పాటు ఇంటి నిర్మాణంకు సహాయ పడటం, పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయమన్నారు.

