30.9 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యార్థులు ఉన్నత విద్య లో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పద్మశాలి వసతి గృహం కై స్థల సేకరణ తో పాటు భవన నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సహకారం

. . . పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

పద్మశాలి విద్యార్థుల ఉన్నత విద్య ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, చదువుకోవాలనే సంకల్పం ఉన్న విద్యార్థుల ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన పద్మశాలి విద్యార్థుల వసతి గృహ సంస్థ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Congress government takes special steps to ensure students are at the forefront of higher education

 

2025 నుంచి 2028 సంవత్సరాల వరకు ఆదివారం నూతన పద్మశాలి విద్యార్థుల వసతి గృహ సంస్థ కార్యవర్గ లో అధ్యక్షుడు డి కొండ యాదగిరి ప్రధాన కార్యదర్శిగా గంట్యాల వెంకట నరసయ్య, కోశాధికారిగా కన్న రాజు ఉపాధ్యక్షులు ముగ్గురు తో పాటు ఇతర కార్యవర్గ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. మొదటగా ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ విద్య వైద్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కంకణబద్ధంగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని, బడ్జెట్ లో ఎంత ఖర్చయినా ఇప్పటికీ కూడా విద్య కోసం వైద్య కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక నిధులు వెచ్చిస్తుందన్నారు.

Congress government takes special steps to ensure students are at the forefront of higher education

అనంతరం పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఆరు నూరైనా నూరు ఆరైనా జిల్లా కేంద్రంలో పద్మశాలి విద్యార్థుల వసతి గృహ స్థలం కొరకు స్థల  సేకరణ కోసం ఆ స్థలంలో పద్మశాలి విద్యార్థుల వసతి గృహ సంస్థను నిర్మించి తీరుతామని ఆయన వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ విద్యా వైద్యం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే ఆ ప్రభుత్వానికి పేరు వస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని కుల సంఘాలు తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, నూడా చైర్మన్ కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article