28.8 C
Hyderabad
Monday, August 3, 2026

18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మన్నం పాండురంగారావు విస్తృత ప్రచారం

Must read

📰 Generate e-Paper Clip

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ పట్టణంలోని 18వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి మన్నం పాండురంగారావు కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓటర్లతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ, తనను గెలిపిస్తే కాలనీలోని మౌలిక సదుపాయాల సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అభ్యర్థి స్వయంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలవడం పట్ల స్థానికులు సానుకూలంగా స్పందిస్తూ, తమ సమస్యలను వివరించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article