18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మన్నం పాండురంగారావు విస్తృత ప్రచారం
బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలోని 18వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి మన్నం పాండురంగారావు కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓటర్లతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ, తనను గెలిపిస్తే కాలనీలోని మౌలిక సదుపాయాల సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అభ్యర్థి స్వయంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలవడం పట్ల స్థానికులు సానుకూలంగా స్పందిస్తూ, తమ సమస్యలను వివరించారు. ఈ ప్రచార కార్యక్రమంలో...