25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బీసీ, ఎస్సీ సంఘాలకు ఇస్తామన్న నిధులు ఎక్కడా..

 

. . . బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఆరు గ్యారంటీల పేరుతో పేద ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిర్ప రాజు మాట్లాడుతూ బీసీలకు లక్ష కోట్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ రెండున్నర సంవత్సరాల కాలం కాలయాపన చేసిందని, జల్సాల కోసం ఫుట్ బాల్ టోర్నమెంట్, గాంధీ విగ్రహం, ఢిల్లీ టూర్ ల కోసం కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలను అడ్డుపెట్టుకొని ఓట్లు దండుకునే ప్రయత్నం చేయడం జరిగిందని అన్నారు. ఆ భయంతో నే ఎంపిటిసి,  జడ్పిటిసి ఎన్నికలను వాయిదా వేసుకున్నారని, అసలు ఎన్నికలు పెడతారా లేదా అనే విషయం ఇప్పటివరకు తెలియలేదని ఎద్దేవా చేశారు. ప్రజా పాలన పేరుతో మూడుసార్లు అప్లికేషన్లు తీసుకొని వాటిని ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందని, పట్టణ ప్రగతి ఎక్కడ చేస్తున్నారో, ఏం చేస్తున్నారో కనీసం మీ అధికారులకైన, మీ నాయకులకైనా చెప్పారా అని మండిపడ్డారు. ఎస్సీలకు రుణాలు లేవని, దళిత బంధు ఇస్తానని చెప్పి మోసం చేసిన అతి పెద్ద ద్రోహం సీఎం రేవంత్ రెడ్డిదే అని అన్నారు. ఎస్సీలకు సంబంధించి ఎలాంటి స్కీములు, రుణాల గురించి మాట్లాడిన వారు లేరని, అసలు సమాజం ఎటువైపు వెళుతుందో ముఖ్యమంత్రికే తెలియాలన్నారు. రానున్న రోజుల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, కుంటుపడ్డ కులవృత్తులు వెలుగులు వెలుగుతాయని, ఈ బడ్జెట్లో ముమ్మాటికి ఎస్సీ బీసీలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు నీలగిరి రాజు, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, బీసీ అధ్యక్షుడు గాండ్ల లింగం, జమాల్ పూర్ రమేష్, చింతకాయల రాజు, మాకు రవి, నరేష్ గౌడ్, బగ్గాలి అజయ్, అగ్గు సంతోష్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article