నిజామాబాద్, బతుకమ్మ: సీపీఐ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ పోటు ప్రసాద్ మృతి తీరని లోటని పార్టీ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ అన్నారు. ఖమ్మం జిల్లా సీపీఐ కార్యదర్శిగా పని చేస్తున్న ప్రసాద్ ఆకస్మిక మరణం కలిచి వేసిందన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమాల్లో, తెలంగాణ సాధన ఉద్యమంలో పోటు ప్రసాద్ కీలకంగా వ్యవహరించారన్నారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి వై ఓమయ్య, నాయకులు బి.రఘురాం, రాజకుమార్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
