బాన్సువాడ, బతుకమ్మ :
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీపై ఎల్.బి.నగర్ యువ సదస్సులో బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ యువజన నాయకులు బాన్సువాడ పోలీస్ స్టేషన్లో పట్టణ సీఐ తుల శ్రీధర్ కు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నాయకులపైన మరియు కార్యకర్తల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు,రాస్తారోకలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మన్సూర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఖామర్ సుల్తానా గౌస్ తదితరులు పాల్గొన్నారు.
