సమాజ సేవను గుర్తించండి
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు
నిజామాబాద్, బతుకమ్మ : కామన్ మెన్ తో బిజినెస్ మెన్లు ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ఉన్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ ట్రస్మా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా ట్రస్మా సంఘంలో తన వంతు విధులు నిర్వహించి ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించనన్నారు. విపత్కర పరిస్థితులలో ఉన్న ప్రైవేట్ విద్యారంగంలోని ఉపాధ్యాయులకు ఆపత్కాల భృతి కింద రూ.2000, 25 కిలోల బియ్యాన్ని చొప్పున అందజేశానన్నారు. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కోట్ల రూపాయలను ఖర్చులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బిజినెస్ మెన్లుగా ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా బిజినెస్ మెన్ గానే వ్యవహరిస్తారని సర్వీస్ మె న్ గా పనికిరారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు గమనించి సేవ చేసే వ్యక్తులను ఎన్నుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టబద్రులు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అర్హులైన నిరుద్యోగులందరికీ వివిధ వృత్తి విద్య కోర్సులలో కంప్యూటర్ రంగాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డి ఏ మరియు పీఆర్సీ లను అమలు అయ్యేలా కృషి చేస్తానన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర కోశాధికారి జయ సింహా గౌడ్, జిల్లా అధ్యక్షులు నిత్యానందం, ప్రధాన కార్యదర్శి అరుణ్, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ నరసింహారావు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ జనార్ధన్, నారా గౌడ్, పాఠశాల శ్రీనివాస్, నగేష్, పృధ్వీ, తదితరులు పాల్గొన్నారు.
