24 C
Hyderabad
Sunday, August 2, 2026

నష్టపోయిన పంటకి పరిహారం చెల్లించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • అధికారులు పంట నష్టం పై నివేదిక ఇవ్వాలి
  • కల్లంలో తడిసిన సంచులను రైస్ మిల్లర్లు దించుకోవాలి
  • కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

 

కామారెడ్డి, బతుకమ్మ : రాళ్ళ వానకి నష్టపోయిన పంటకి నష్ట పరిహారం చెల్లించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి అకాల వడగళ్ల వాన కారణంగా నష్టపోయిన పంటను, కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని ఆయన బుధవారం అడ్లూర్, చిన్న మల్లారెడ్డి, తలమడ్ల గ్రామాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడగళ్ల వాన వల్ల ఇంకా కోత కానీ వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయని,  నష్టపోయిన పంటకి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు పంట నష్టం పై నివేదిక ఇవ్వాలని కోరారు. తడిసిన సంచులను రైస్ మిల్లర్లు దించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు సాధ్యమైనంత త్వరగా కాంట పూర్తి చేయాలని అన్నారు. తూకం వేసిన వడ్లు సాధ్యమైనంత తొందర రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు.

Compensation should be paid for the lost crop.

More articles

Latest article